Sunday, May 5, 2024

వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ కానుక‌గా భోళా శంక‌ర్-రిలీజ్ డేట్ ఎనౌన్స్

నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తోన్న భోళా శంక‌ర్ చిత్రం రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేశారు చిత్ర మేక‌ర్స్. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. భోళా శంక‌ర్ సినిమాను వచ్చే ఏడాది స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ 14న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. సిస్ట‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధానంగా సాగే ఈ చిత్రంలో చిరుకు చెల్లెలిగా కీర్తి సురేష్ న‌టిస్తుంది. త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్టైన‌మెంట్స్, క్రియేటీవ్ క‌మ‌ర్షియ‌ల్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అంతేకాకుండా ఓ క్లాస్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో చేతిలో త్రిషూలం లాకెట్‌తో ఉన్న చైన్‌ను తిప్పుతూ కూలింగ్ గ్లాసెస్ ధ‌రించి స్టైలిష్ లుక్‌లో ఉన్నారు. త‌మిళంలో సూప‌ర్ హిట్ట‌యిన వేదాళం సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement