Thursday, May 2, 2024

మెగా ఫ్యాన్స్ కు మెగా అప్‌డేట్.. ‘భోళా శంకర్’ టీజర్ అప్పుడే..

మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీ భోలా శంకర్. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అజిత్ నటించిన వేదాళంకి అఫీషియ‌ల్ రీమేక్ గా తెర‌కెక్కుంది. ఈ మూవీలో చిరు సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. కాగా, మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ అప్ డేట్ రానే వ‌చ్చింది. భోళా శంకర్ టీజర్ జూన్ 24న రిలీజ్ చేయ‌నున్నారు మేక‌ర్స్. ఇదే విషయాన్ని ప్రకటించేందుకు మేకర్స్ చిరంజీవి స్టైలిష్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.

ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. మొదటి సింగిల్ భోలా మానియాకు మంచి స్పందన వచ్చింది. ఇక పోతే భోలా శంకర్ ఆగస్ట్ 11న బిగ్ స్క్రీన్‌లపైకి రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement