Tuesday, April 30, 2024

IPL | టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు

ఐపిఎల్ 2023 16వ సీజ‌న్ లో భాగంగా ఇవ్వాల రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ 50వ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు ఫాఫ్ డు ప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా, మ‌రి కొద్ది సేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఇక ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన మ్యాచ్ ల‌లో రెండు జ‌ట్లు 9 మ్యాచ్ లు ఆడ‌గా.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 3 మ్యాచ్ లు గెలిచి ఆరు ఓడిపోయింది.. రాయల్ ఛాలెంజర్స్ జట్టు 5 మ్యాచ్ లు గెలిచి నాలుగు మ్యాచ్ లు ఓడిపోయింది.. దీంతో పాయింట్స్ టేబుల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరు టీం ఐదో స్థానంలో సెటిల్ అవ్వగా.. ఢిల్లీ జ‌ట్టు పాయింట్స్ టేబుల్ లో చివ‌రి స్థానంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement