Friday, May 17, 2024

షారుఖ్ ఖాన్ ‘జవాన్’ మూవీ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్..

అట్లీ కుమార్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా న‌టిస్తోన్న మూవీ జవాన్‌. ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాపై ప్రేక్ష‌కులు, అభిమానుల్లో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. కాగా, ఈ మూవీని మొదట జూన్ 2న విడుదల చేయాలని నిర్ణయించారు మేక‌ర్స్. అయితే షూటింగ్ ఆలస్యం కావడం, వీఎఫ్ఎక్స్ వర్క్ లేట్ అవ్వడంతో రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది.

కాగా, రాబోయే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెలుగు, హిందీ, తమిళం భాషలలో సెప్టెంబర్ 7న థియేటర్లలోకి రానున్న‌ట్టు ప్ర‌క‌టించారు మేక‌ర్స్. అయితే జవాన్ మూవీ వాయిదా ఎప్పట్నుంచో రూమర్స్‌లో ఉంది. మార్చి నుంచే ‘జవాన్’ అనుకున్న తేదీని అందుకోలేదని వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్లే ఏప్రిల్‌లో కూడా సినిమా షూటింగ్‌ను కొనసాగించారు. ఏప్రిల్ నెలాఖరులో షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement