Monday, May 6, 2024

బెదురులంక 2012 రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రకటించిన మేకర్స్

డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వం లో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ హీరోగా తెరకెక్కిస్తున్న మూవీ బెదురులంక 2012. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ఈ సినిమాని రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా మేకర్స్ ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు.

ఈ సినిమాని వచ్చే నెల (జూన్)లో వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని వెల్లడించడానికి ఓ కొత్త పోస్టర్ ని కూడి రిలీజ్ చేశారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో డీజే టిల్లు ఫేం నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement