Tuesday, May 7, 2024

ధైర్యంగా ఉన్నా, ఐ లవ్‌ యూ ఉక్రెయిన్‌.. జెలెన్‌ స్కీ భార్య ఒలెనా జెలెన్‌

రష్యా దాడులను దీటుగా తిప్పికొడుతున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీకి బలం ఆ దేశ ప్రజలే.. అయితే దీనికి ఆయన సతీమణి ఒలెనా జెలెన్‌ స్కా కూడా తోడయ్యారు. సైనికుల్లో.. భర్త జెలెన్‌ స్కీ స్ఫూర్తి నింపుతుంటుంటే.. ఒలెనా జెలెన్‌ స్కా.. ప్రజల్లో మనో ధైర్యం నింపుతున్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్‌ స్కా.. ప్రజలనుద్దేశించి.. ఓ వీడియోను విడుదల చేశారు. ప్రియమైన ఉక్రెయిన్‌ ప్రజలారా.. ఇది యుద్ధ సమయం.. ఈ కష్ట కాలంలో నా భర్త పక్కన కూడా నేను ఉండాలి. అది వీలుపడటం లేదు. ఎందుకంటే.. నా పిల్లలు నా వైపే చూస్తున్నారు. నా అవసరం వీళ్లకు ఎంతో ఉంది. అయినా నా కళ్లు ఇప్పుడు మిమ్మల్నే గమనిస్తున్నాయి. మీ భద్రత గురించే నా ఆందోళన అంతా.. ప్రతి క్షణం టీవీల్లో, వీధుల్లో, ఇంటర్నెట్‌లో మీరు చేస్తున్న పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే.. మీలాంటి ప్రజలతో కలిసి ఈ గడ్డపై కలిసి బతుకున్నందుకు ఎంతో గర్వంగా ఉంది.. నాకు ఇప్పుడు కన్నీళ్లు రావడం లేదు.. ధైర్యంగానే ఉన్నా.. ఐ లవ్‌ యూ ఉక్రెయిన్‌ అంటూ ఒలెనా జెలెన్‌ స్కా వీడియో సందేశం ఇచ్చారు.

వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్‌..

ఉక్రెయిన్‌ ప్రథమ మహిళ 44 ఏళ్ల ఒలెనా వోలోడిమివ్నా జెలెన్‌ స్కా.. వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్‌, రచయిత.. 2019లో ఫోకస్‌ మ్యాగజైన్‌ ద్వారా అత్యంత ప్రభావవంతమైన 100 మంది ఉక్రెయిన్ల జాబితాలో జెలెన్‌ స్కా 30వ స్థానంలో నిలిచారు. 2003లో ప్రెసిడెంట్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీను పెళ్లి చేసుకున్నారు. జెలెన్‌ స్కా, జెలెన్‌ స్కీ.. ఇద్దరూ పుట్టింది ఒకే ఊరిలో.. ఒకే సంవత్సరంలో.. ఇద్దరూ చదువుకున్నది కూడా ఒకే స్కూళ్లో కావడం గమనార్హం. అయితే కాలేజీ రోజుల్లోనే ఈ ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. ఆ పై ప్రేమ.. 2003లో పెళ్లితో ఒక్కటయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement