Tuesday, May 21, 2024

వారణాసిలో మోడీ మెగా రోడ్‌ షో, జై శ్రీరామ్‌ నినాదాలు.. గంచా, టోపీతో మోడీ న్యూ లుక్‌

ఉత్తర్‌ప్రదేశ్‌ చివరి దఫా ఎన్నికల్లో భాగంగా.. అన్ని పార్టీల నేతలు శుక్రవారం జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. వారణాసిలో భారీ రోడ్‌ షోలో పాల్గొన్నారు. 7వ తేదీన యూపీ చివరి దఫా ఎన్నికలు జరనున్న నేపథ్యంలో.. పార్టీ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. వారణాసికి పొరుగునే ఉన్న మీర్జాపూర్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న తరువాత.. తన సొంత లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసికి మధ్యాహ్నం చేరుకున్నారు. మాల్దాహియా క్రాసింగ్‌ వద్ద ఉన్న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు అర్పించారు. అనంతరం రోడ్‌ షోను ప్రారంభించారు. ఈ మెగా రోడ్‌ షోలో ప్రధాని మోడీ ప్రత్యేకంగా కనిపించారు. మెడలో కాషాయ రంగు గంచా (టవల్‌), తలపై టోపీ ధరించారు. రోడ్‌ షో వారణాసిలో సుమారు మూడు కిలోమీటర్ల మేర సాగింది.

ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలు, అభిమానులు జై శ్రీరామ్‌, హర హర మహాదేవ్‌ అనే నినాదాలతో వారణాసి వీధులను మారుమోగించారు. ఈ సందర్భంగా పైనుంచి పూల వర్షం కురిపించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం.. రోడ్‌ షో ముగింపు అనేది.. ఇటీవల ప్రారంభించిన కాశీ విశ్వనాథ ఆలయ కాంప్లెక్స్‌లో జరగాలి. అక్కడ మోడీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలి. 2014 లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్‌ పత్రాలను దాఖలు చేసిన తరువాత.. మోడీ అదే స్థలం నుంచి వారణాసిలో తన మొదటి రోడ్‌ షోను ప్రారంభించారు.

మెగా రోడ్‌ షో ముగిసిన తరువాత మోడీ డీజెల్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌ (డీఎల్‌డబ్ల్యూ) అతిథి గృహంలో బస చేశారు. ఈ మెగా రోడ్‌ షో బాధ్యతలు బీజేపీ వారణాసి పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్‌ రాయ్‌ తీసుకున్నారు. మోడీ పాల్గొన్న రోడ్‌ షో.. మొత్తం మూడు నియోజకవర్గాలను కవర్‌ చేసింది. కాంటోన్మెంట్‌, వారణాసి నార్త్‌, వారణాసి సౌత్‌ నియోజకవర్గాల గుండా రోడ్‌ షో కొనసాగింది. నేడు రోహినియా నియోజకవర్గంలోని ఖజురియా గ్రామంలో నిర్వహించే ర్యాలీలో మోడీ పాల్గొంటారు. ఈ ప్రాంతంలో సుమారు 5 అసెంబ్లిd నియోజకవర్గాలను చుట్టనున్నారు. మోడీ రోడ్‌ షో పూర్తయిన తరువాత.. సమాజ్‌వాదీ పార్టీ ఆధ్వర్యంలో భారీ రోడ్‌ షో నిర్వహించారు. దీనికి అఖిలేష్‌ యాదవ్‌ నేతృత్వం వహించారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన ఈ రోడ్‌ షో.. రాత్రి వరకు కొనసాగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement