Wednesday, May 8, 2024

బీసీ అధ్య‌క్షుడు ‘ఆర్ కృష్ణ‌య్య’ కారెక్క‌నున్నారా..

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల వేళ ప‌లువురు టిఆర్ ఎస్ పార్టీలోకి చేరి గులాబి కండువాని క‌ప్పుకున్నారు. రాజ‌కీయాల‌న్నాక ఒక పార్టీ నుంచి మ‌రొక పార్టీలోకి మార‌డం స‌హ‌జ‌మే. కాగా ఇప్ఉడు ఓ వార్త వైర‌ల్ అవుతోంది. బిసీల హ‌క్కుల కోసం పోరాడిన ఓ నేత ఇప్పుడు కారెక్క‌నున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఆయ‌నే ఆర్ కృష్ణ‌య్య‌. బీసీల హ‌క్కుల కోసం చేసిన పోరాటంలో ఈయ‌న‌ది కీల‌క పాత్ర‌. ఈ బీసీ నేత 2014 ఎన్నికల ముందు టీడీపీ కండువాని కప్పుకున్నారు. అప్పట్లో టీఆర్ఎస్ జోరుకు కళ్లెం వేసేందుకు… చంద్రబాబు కృష్ణాస్త్రాన్ని సంధించారు. బీసీ పోరాట నాయకుడిగా పేరున్న ఆర్.కృష్ణయ్యను అప్పటికప్పుడు పార్టీలోకి తీసుకురావడమే కాకుండా… తెలంగాణ టీడీపీ తరపున సీఎం అభ్యర్థిగా ప్రకటించేశారు. ఏకంగా సీఎం పదవి ఆఫర్ చేయడంతో కాదనలేక రాజకీయాల్లోకి వచ్చిన ఆర్. కృష్ణయ్య… ఆ తర్వాత పరిస్థితులు అంతగా సహకరించలేదు.

ఆ తర్వాత టీడీపీ తెలంగాణాలో కనుమరుగవడంతో ..కృష్ణయ్య కూడా సైలెంట్ అయిపోయారు .. అయితే కొంత కాలంగా కృష్ణయ్య ..టిఆర్ ఎస్ పట్ల పాజిటివ్ గా ఉంటున్నారు .దీంతో ఆయన కారెక్కడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది .. 2016 లోనే కృష్ణయ్యని గులాబీ గూటికి చేర్చాలని సీఎం కేసీఆర్ భావించిన అది జరగలేదు .. ఇక తాజాగా హుజురాబాద్ లో టిఆర్ ఎస్ కి కృష్ణయ్య మద్దతు ఇవ్వడాన్ని బట్టి అయన కారెక్క‌నున్నార‌నే రూమ‌ర్స్ వ‌స్తున్నాయి . హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాల్సిందిగా 120 బీసీ సంఘాలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయని.. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు.

అంతేకాదు టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నందుకు తాము అనేక కారణాలు చెప్పగలమని, ఈటల రాజేందర్‌కు మీరు మద్దతు ఇవ్వడానిగల కారణాలు చెప్పగలరా అని ఆయన సవాలు చేయ‌డం విశేషం. ద‌ళిత‌బంధుతో పాటు బీసీబంధు పథకం పెట్టాలని, ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశామన్నారు. దాంతో కేసీఆర్‌ బీసీబంధు పథకంపై సానుకూలత వ్యక్తం చేశారని, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామని ప్రకటించారని వెల్ల‌డించారు.బీసీల అభ్యున్నతికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, అందుకే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు మద్దతు ఇస్తున్నామని స్పష్టంచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement