Saturday, May 4, 2024

రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం విడుదల.. తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే..

జీఎస్టీ పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రూ.44వేల కోట్లు విడుదల చేసింది. కొవిడ్‌ కారణంగా ఏర్పడిన పన్ను నష్టం భర్తీ కోసం బహిరంగ మార్కెట్‌ నుంచి సేకరించిన రుణాలను యథాతథంగా రాష్ట్రాలకు పరిహారం రూపంలో చెల్లించినట్లు కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.905.59 కోట్లు, తెలంగాణకు రూ.1,264.78 కోట్లు ఇచ్చినట్లు తెలిపింది. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం రూ.1.59 లక్షల కోట్ల బకాయిలను పూర్తిగా చెల్లించినట్లైందని పేర్కొంది. ఇందులో ఏపీకి రూ.3,272.19 కోట్లు, తెలంగాణకు రూ.4,569.49 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించింది. ఆదాయనష్ట భర్తీ కోసం జులై 15న రూ.75వేల కోట్లు, అక్టోబరు 7న రూ.40వేల కోట్లు, ఇప్పుడు రూ.44వేల కోట్లు విడుదల చేసినట్లు గుర్తుచేసింది. సెస్‌ వసూలు ద్వారా వచ్చే మొత్తం నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు మరో రూ.లక్ష కోట్లు పరిహారం కింద అందించనున్నట్లు తెలిపింది. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం కింద మొత్తం రూ.2.59 లక్షల కోట్లు దక్కుతుందని పేర్కొంది. ఇప్పుడు విడుదల చేసిన రూ.44వేల కోట్లను 5 ఏళ్ల కాలానికి సెక్యూరిటీల విక్రయం ద్వారా 5.69% సగటు వడ్డీతో రుణంగా సేకరించినట్లు వివరించింది.

ఇది కూడా చదవండి: ఆర్‌బీఐ గవర్నర్‌గా మళ్లీ శక్తికాంత్ దాస్

Advertisement

తాజా వార్తలు

Advertisement