Saturday, December 7, 2024

ఆర్‌బీఐ గవర్నర్‌గా మళ్లీ శక్తికాంత్ దాస్

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో మూడేళ్లు పొడిగించింది. శక్తికాంత దాస్ పునఃనియామకాన్ని కేబినెట్ పునర్నియామక కమిటీ ఆమోదించింది. ఆర్​బీఐ గవర్నర్‌గా శక్తికాంత్ దాస్‌ పదవి కాలం ఈ ఏడాది డిసెంబరు 10తో ముగియనుంది. అయితే, తాజాగా  కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో మరో మూడేళ్లపాటు లేదా కేంద్రం ఇచ్చే తదుపరి ఆదేశాల వరకు ఆయన అదే పదవిలో కొనసాగనున్నారు.


కాగా, గతంలో ఆర్థిక మంత్రత్వశాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగా పనిచేసిన శక్తికాంత దాస్.. 11 డిసెంబరు 2018లో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ గడువు ఈ ఏడాది డిసెంబరుతో ముగియనున్న నేపథ్యంలో తాజాగా ఆయన పదవీ కాలాన్ని పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇది కూడా చదవండి: ప్రగతి రథానికి యువ సారథులు

Advertisement

తాజా వార్తలు

Advertisement