Thursday, April 25, 2024

ప్రగతి రథానికి యువ సారథులు

కొంతమంది యువకులు ముందు యుగం దూతలు అన్నాడు శ్రీ శ్రీ. ఆ ముందు యుగం దూత లు జిల్లా కలెక్టర్లయి ప్రగతి రథాన్ని ముందుకు పరుగెత్తించడం, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి సంకల్ప బలం ఉంటే చాలని ఎలుగెత్తి చాడటం, హార్డ్‌ వర్క్‌ కాదు స్మార్ట్‌ వర్క్‌ అని నినదించడం ఇవాళ తెలంగాణా వ్యాప్తంగా నడుస్తున్న కొత్త ట్రెండ్‌. ఆ ట్రెండ్‌కి కూడా మార్గదర్శి కేసీఆరే. ఆ కథ చదవండి.
తెలంగాణ పునర్నిర్మాణంలో యువకలెక్టర్లు దూసుకుపోతున్నారు. కేసీఆర్‌ పరిపాలనా విభజన లో భాగంగా 33 జిల్లాలను ఏర్పాటు చేయటంలో ప్రజలకు చేరువగా ప్రభుత్వ సేవలు అందే స్థితి వచ్చింది. ఈ దిశలో భాగంగా జిల్లా పాలనా రథ సారథులుగా ఉన్నవారిలో ఎక్కువ మంది కలెక్టర్లు యువకులుగా ఉన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా పలుశాఖ లు ముందున్నెడూ సాధించని ఫలితాలను ఆచరణలో చూపుతున్నారు. కేసీఆర్‌ ఎంచు కున్న లక్ష్యాలను, ఆలోచనలను ఆచరణలో కార్యసాధకులుగా పనిచేస్తూ ఆపదవులకే వన్నె తెస్తున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ”దళిత బంధు” పథకం ప్రవేశపెడితే దాన్ని విజయవంతం చేయటానికి #హుజూరాబాద్‌ డిక్లరేషనను అమలు జరపటానికి కేసీఆర్‌ యువకలెక్టర్‌ కర్ణన్‌ను ఎంచుకు న్నారు. రా#హుల్‌ బొజ్జా సీఎంఓలో కార్యదర్శిగా పని చేస్తూ కార్యదక్షత చూపుతున్నారు. కలెక్టర్‌ కర్ణన్‌ వాడవాడలకు వెలుతూ దళితుల ఇళ్ల వాకిళ్లలో వారి తో పాటు కిందకూర్చొని వాళ్లు ఏ పనిని ఎంచుకుంటు న్నారో తెలుసుకుని చర్చించి సన్నద్ధం చేస్తున్నారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకు 2 వారాల్లో 21 వేల దళితుల సమగ్ర నివేదికను వాళ్లు ఎంచుకున్న పనిని నివేదన తయారు చేశారు. యుద్ధ ప్రాతిపదికపై పనులు చేసేం దుకు కొత్త కలెక్టర్లు కార్యక్షేత్రంలో దూసుకుపోతు న్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలలో సౌకర్యా ల కల్పనలో గిరిజన గూడెల దాకా వైద్య సౌకర్యాల అందించటంలో కొత్తగూడెం యువ కలెక్టర్‌ అనుదీప్‌ శ్రమిస్తున్నారు. కలెక్టరుగా తన కార్యాలయం నుంచి కింది స్థాయి ఉద్యోగులకు ఆదేశాలు పంపకుండా కార్యక్షేత్రంలో దూకి పనిచేస్తున్నారు. కలెక్టర్‌ నేరుగా గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకమై పనిచేస్తుంటారు. అది కింది స్థాయిలో సిబ్బందికి ఎంతో ప్రోత్సాహాన్ని ప్రేరణను కలిగిస్తుంది. కొత్త గూడెం జిల్లా అంటే సగం ప్రాంతం గిరిజ నులు ఆదివాసీలతో నిండిన ప్రదేశం. వైద్యాన్ని గిరిజన గూడాల దగ్గరకు తీసుకు పోవాలన్నది ముఖ్య మంత్రి కేసీఆర్‌ లక్ష్యం. ఆ దిశగానే వైద్యరంగాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తూ మూడంచెల వైద్య వ్యవస్థను ఐదంచల వ్యవస్థగా మార్చారు. ప్రధానంగా కేసీఆర్‌ లక్ష్యం పల్లెకు మారుమూలలకు వైద్యం అందాలి. అందుకు బస్తీ దవఖానాల మాదిరిగా పల్లె దవఖానాలు నెలకొల్పే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆయన ఆలోచనలకు అనుగుణంగా పల్లె దవఖానాలను సమర్ధవంతం చేసేందుకు కలెక్టర్లు కృషి చేస్తున్నారు. కొత్తగూడెంలో ప్రస్తుతం డెంగ్యూ వ్యాధి నివారణ కోసం కలెక్టర్‌ అనుదీప్‌ బాగా కృషి చేస్తున్నారు. దానిమీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వైద్య సిబ్బందిని అటవీ ప్రాంతానికి పంపించారు. అన్ని రకాల రక్త పరీక్షలు చేయిస్తున్నారు. ఇంతకు ముందు కలెక్టర్లు ఈ పని చేసినప్పటికినీ అనుదీప్‌ యువకుడు కావటంతో ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నారు. మాతాశిశు సంరక్షణా కేంద్రం (ఐటిడిసి) తల్లులకు, బిడ్డలకు పౌష్ఠి కాహారాన్ని అందిస్తుంది. కలెక్టర్‌ అనుదీప్‌ శ్రీమంతాలు చేసే కార్యక్ర మాల దగ్గరకు వెళ్లి ఆడవాళ్లు గర్భిణీ సమయంలో తీసుకోవల్సిన పౌష్ఠికాహారం జన్మించిన బిడ్డకు తల్లిపాలు తాగించాలన్న అవగా#హనను కల్పిస్తున్నారు. తల్లులకు అందించే పౌష్టికాహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. పేద తల్లుల కడుపులో పెరిగే బిడ్డల సంరక్షణను చూడటంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్న కేసీఆర్‌ ఆలోచనలను అనుదీప్‌ అక్షరాల అమ లు చేస్తున్నారు. ఈ విషయమే కాదు పలు శాఖల పనితీరును పర్యవేక్షించేందుకు తానే కార్యక్షేత్రంలోకి పోయి జనంలోకి చొచ్చుకు పోతున్నారు. ఇది మంచి పరిణామం. అనుదీప్‌ మాతృ#హృదయంతో పనిచేస్తున్నారు. అనుదీప్‌కు సివిల్స్‌లో నేషనల్‌ ర్యాంకు వచ్చినప్పుడు కలిగిన ఆనందం కంటే కొత్తగూడెం కలెక్టర్‌గా గిరిజన గూడెలకు వెళ్లి వాళ్ల గుండె దండోరా వింటున్నప్పుడు సంతోషం ఎక్కువైంది. కొత్తగూడెం ఐటిడి. ఏ.పి.ఓ గా, ఉమ్మడి ఖమ్మం జిల్లా జె.సీగా పనిచేసిన దివ్య దేవరాజన్‌ ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా పనిచేశారు. భద్రాచలంలో ఉన్నప్పుడు కోయలతో మాట్లాడేందు కు కోయ భాష ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న ప్పుడు గొండు భాషను నేర్చుకున్నారు. గిరిజనులు గోండులు, ఆదివాసీల జీవితాలతో కలిసిపోయి వాళ్ల కళలు, సంస్కృతి సాంప్రదాయాలను ఆకళింపు చేసుకున్నారు. గిరిజనుల ప్రాథమిక #హక్కులను అమలు పరుస్తూ మంచి అధికారిగా పేరు తెచ్చుకు న్నారు. సంగారెడ్డి కలెక్టర్‌గా మంత్రి ప్రగాడ #హను మంతరావు కృషితో వందశాతం వైకుంఠదామాలను పూర్తిచేసిన తొలి జిల్లాగా నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాలలో పోషన్‌ అభియాన్‌ అవార్డును జాతీయ స్థాయిలో అందుకున్నారు. #హనుమకొండ కలెక్టర్‌గా పనిచేసిన అమయ్‌ కుమార్‌ పల్లెపట్టణ ప్రగతిపై బాగా పనిచేశారు. మహాబూబ్‌ నగర్‌ జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రాస్‌ జిల్లాలో ప్రభుత్వ రికార్డులను డిజిటలైజ్‌ చేశారు. రెవెన్యూ రికార్డులను పక్కాగా నిర్వ#హంచా రు. అన్ని రంగల్లో తనదైన ముద్ర వేశారు. చారిత్రా త్మకమైన 600 సంవత్సరాల పిల్లలమర్రలోని మర్రి చెట్టుకు చెదలు పడితే చికిత్స చేయించి సెలైన్‌ బాటిల్‌ ఎక్కించి పునరుజ్జీవింప చేశారు. రంగారెడ్డి, మెదక్‌ ఉమ్మడి జిల్లాల్లో యువకలెక్టర్‌ స్మిత సబర్వాల్‌ తనదైన ముద్రవేసి అంకి త భావంతో పనిచేశారు. అధికారుల నిబద్ధత ఎంత మంచి ఫలితాలు వస్తాయో తెలుసుకోవా లనుకుంటే ఏ ఒక్క కలెక్టర్‌ని అయినా మీరు పలకరించండి. వాళ్ళ కష్టం సౌఖ్యం మీకూ స్ఫూర్తిని ఇస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement