Sunday, May 5, 2024

బీసీ బిల్లుపై పార్లమెంట్‌లో గళమెత్తుతాం… బీసీ జనగణనపై ఆప్ సానుకూల స్పందన..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్ల సాధనకు ఆమ్ ఆద్మీ పార్టీ కట్టుబడి ఉందని, బీసీ బిల్లుకు తమ సంపూర్ణ మద్ధతు ఉంటుందని ఆ పార్టీ నేషనల్ సెక్రటరీ పంకజ్ గుప్తా తెలిపారు. మంగళవారం బీసీ సంక్షేమ సంఘం నేషనల్ బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ నేతృత్వంలో ఢిల్లీలోని ఆప్ కార్యాలయంలో కలిసి బీసీ బిల్లు ప్రాముఖ్యత, బీసీ జనగణన ఆవశ్యకతను బీసీ నాయకులు ఆప్ పార్టీ ప్రతినిధులకు వివరించారు. ఈ అంశంపై తమ పార్టీలో ముఖ్య నాయకుల అంతర్గత సమావేశంలో చర్చిస్తామని పంకజ్ గుప్తా హామీ ఇచ్చారు.

ఆప్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్, ఎంపీ సంజయ్ సింగ్‌ను ఆయన నివాసంలో కలిసిన బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు బీసీ బిల్లుపై పార్లమెంట్ లో ప్రస్తావించాలని కోరారు. బీసీ బిల్లుకు తమ మద్దతు తప్పక ఉంటుందని, బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించే విధానానికి తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. ఈ అంశాన్ని పార్లమెంట్ సమావేశాల్లో జీరో అవర్‌లో లేవనెత్తుతామని భరోసా ఇచ్చారు. బీసీ జనగణన, బిల్లుకు మద్దతు తెలిపినందుకు దాసు సురేష్ వారికి ధన్యవాదాలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement