Sunday, May 12, 2024

మార్చిలో 8 రోజులు మూతపడనున్న బ్యాంకులు

అమరావతి, ఆంధ్రప్రభ : మార్చి నెలలో దేశంలో బ్యాంకులు దాదాపు సగం రోజులపాటు మూతపడనున్నాయి. భారతీయ రిజర్వు బ్యాంకు ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం ఈ నెలలో 13 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. అయితే, ఆయా రాష్ట్రాల్రను బట్టి ఈ సెలవుల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణలో మాత్రం బ్యాంకులకు 8 రోజులు సెలవులు రానున్నాయి. మహాశివరాత్రి, హోలీ వంటి ప్రధాన పండుగలతోపాటు- రెండు, నాలుగో శనివారంతో పాటు నాలుగు ఆదివారాలు బ్యాంకులు మూతపడనున్నాయి.

ఇక ఈనెల 1వ తేదీ మహా శివరాత్రి, 6న ఆదివారం, 12న రెండో శనివారం, 13న ఆదివారం, 18న శుక్రవారం హోలీ, 20న ఆదివారం, 26న నాలుగో శనివారం, 27న ఆదివారం కావడంతో తెలుగు రాష్ట్రాల్ల్రో మొత్తంగా 8 రోజులు మూతపడనున్నాయి. బ్యాంకులు మూతలో ఉన్నప్పటికీ ఏటీ-ఎం కేంద్రాలు, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు మాత్రం అందుబాటు-లో ఉంటాయని బ్యాంకు అధికారులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement