Tuesday, April 30, 2024

2023లో బ్యాంకు సెలవులివే..

డిజిటల్‌ యుగంలో ఆర్థిక లావాదేవీలన్నీ ఇంటర్నెట్‌ ద్వారా చక్కబెట్టే రోజులు వచ్చాయి. అయినప్పటికీ కొన్ని విషయాల్లో నేరుగా బ్యాంకింగ్‌ సేవలు పొందడం అనివార్యంగా ఉంది. దాంతో ప్రతీనెలా బ్యాంకు పనిదినాలను చెక్‌ చేసుకోవడం పరిపాటిగా మారింది. రెండు రోజుల్లో మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో 2023 ఏడాదికి సంబంధించి ఆర్‌బీఐ బ్యాంకింగ్‌ సెలవు తేదీలను ప్రకటించింది. సంక్రాంతి నుంచి దీపావళి దాకా పండుగ సెలవులతోపాటు, ఆదివారం, రెండవ, నాల్గవ శనివారాల సెలవు తేదీల జాబితాను విడుదల చేసింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో స్థానిక పండగల ప్రాధాన్యం దృష్ట్యా ఈ తేదీల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకింగ్‌ సెలవుల విషయానికొస్తే (ఆది, శనివారాలు మినహాయించి) మొత్తంగా 23రోజులు బ్యాంకు (ప్రత్యక్ష) సేవలు అందుబాటులో ఉండవు.

సెలవు తేదీల వివరాలు…

జనవరి 15 – సంక్రాంతి , జనవరి 26 – రిపబ్లిక్‌ డే, ఫిబ్రవరి 18 – మహాశివరాత్రి
మార్చి 07 – హోలీ, మార్చి 22 – ఉగాది, మార్చి 30 – శ్రీరామనవమి, ఏప్రిల్‌ 01 – ఆర్థిక వార్షికం ప్రారంభం
ఏప్రిల్‌ 05 – జగ్జీవన్‌రామ్‌ జయంతి, ఏప్రిల్‌ 07 – గుడ్‌ఫ్రై డే, ఏప్రిల్‌ 22 – రంజాన్‌, మే 01 – మే డే
జూన్‌ 29 – బక్రీద్‌, ఆగస్టు 15 – స్వాతంత్య్ర దినోత్సవం, సెప్టెంబర్‌ 07 – కృష్ణాష్టమి,
సెప్టెంబర్‌ 18 – వినాయక చవితి, సెప్టెంబర్‌ 28 – మిలాద్‌ ఉన్‌ నబి, అక్టోబర్‌ 02- గాంధీజయంతి, అక్టోబర్‌ 24- విజయదశమి, నవంబర్‌ 12- దీపావళి, నవంబర్‌ 27 – గురునానక్‌ జయంతి, డిసెంబర్‌ 25 – క్రిసn్మస్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement