Tuesday, May 14, 2024

Bangladesh: ల‌క్ష ఓట్ల‌కు పైగా మెజ‌ర్టీతో బంగ్లా క్రికెట్ కెప్టెన్ షకీబుల్ హసన్ ఘ‌న‌విజ‌యం

బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ ఎంపీగా కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఇన్నాళ్లు మైదానంలో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన షకీబ్ ప్రజాజీవితంలో భాగం కానున్నాడు. వన్డే వరల్డ్ కప్ అనంతరం రాజకీయాల్లో అడుగుపెట్టిన అతడు.. తొలిసారే సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు.

బంగ్లాదేశ్ కు జ‌రిగిన ఎన్నికల్లో మగుర 1 నియోజకవర్గం నుంచి పోటీ చేసిన షకీబ్ భారీ మెజార్టీతో గెలుపొందాడు. ప్రధాని షేక్ హసీనా కు చెందిన అవామీ లీగ్ తరఫున పోటీ చేసిన ఈ ఆల్‌రౌండర్ ఏకంగా లక్షా యాభై వేల మెజార్టీతో సమీప ప్రత్యర్థి రెజౌల్ హసన్ ను చిత్తు చేశాడు. షకీబ్‌కు 1,85,388 ఓట్లు రాగా.. బంగ్లాదేశ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన హసన్‌కు కేవలం 45,933 ఓట్లు మాత్రమే పడ్డాయి. దాంతో, ఎన్నికల్లో గెలిచిన బంగ్లాదేశ్ రెండో కెప్టెన్‌గా ఎంపీగా షకీబ్ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ముష్రఫే ముర్తాజా ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement