Thursday, May 16, 2024

బ‌ల‌గం పాత్ర‌ల ప‌రిచ‌యం…

దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మిస్తోన్న సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ తదితరులు ప్రధాన తారాగణం. వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. త్వర లోనే బలగం సినిమాను రిలీజ్‌ చేయటానికి నిర్మాత దిల్‌ రాజు ప్లాన్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో సినిమాలోని పాత్రలను పరి చయం చేశారు.

ఈ సందర్భంగా జ రిగిన పాత్రికేయుల సమావేశంలో.. దిల్‌ రాజు మాట్లాడుతూ ” బలగం సినిమా షూటింగ్‌ పూర్త య్యింది. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ అనౌ న్స్‌ చేస్తాం. ఇప్పటికే విడుదలైన ఊరు పల్లెటూరు సాంగ్‌ పొట్టి పిల్ల సాంగ్‌లకు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వస్తు న్నాయి. సినిమా ఆర్గానిక్‌గా ఆడియె న్స్‌లోకి వెళ్లిపోయింది. వేణు తన ఐడియాను ప్రాపర్‌గా మ్యూజిక్‌ డైరె క్టర్‌ భీమ్స్‌కి చెప్పటం, అలాగే దానికి అద్భుతమైన సాహిత్యాన్ని కాసర్ల శ్యామ్‌ అందించారు. మరో రెండు పాటలను త్వరలోనే రిలీజ్‌ చేస్తాం. ఆ పాటలు వింటే హృదయాలు కదిలిపోతాయి. అంత గొప్పగా ఉంటాయి పాటలు. ఇప్పుడే ఇంత స్పందన వస్తుంటే రిలీజ్‌ తర్వాత ఇంకా హిట్‌ అవుతుందని భావిస్తున్నాం. ఇక బలగం సినిమా గురించి చెప్పాలంటే వేణు ముందుగానే ఇందులో క్యారెక్టర్స్‌ ఎలా ఉండాలి. అందులో ఎవరు యాక్ట్‌ చేయాలనేది ప్లాన్‌ చేసుకుని వచ్చి నా దగ్గర అప్రూవల్‌ తీసుకుంటూ వచ్చాడు. ముగ్గురు, నలుగురు తప్పితే దాదాపు కొత్త వారినే వేణు యాక్టర్స్‌గా ఎంపిక చేసుకున్నాడు.” అన్నారు. దర్శకుడు వేణు ఎల్దండి మాట్లాడుతూ ”దాదాపు కొత్త వారినే పరిచయం చేశాం. ఇక ఇప్పటికే మా బలగం మూవీ నుంచి విడుదలైన రెండు సాంగ్స్‌కు భీమ్స్‌గారు ఇచ్చిన సాంగ్స్‌, దానికి కాసర్ల శ్యామ్‌ రాసిన లిరిక్స్‌ ఎక్సలెంట్‌. పాటలన్నీ శ్యామ్‌గారే రాశారు.” అన్నారు.
ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌, రూప లక్ష్మి, జయరాం, విజయలక్ష్మి తదితరులు నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement