Sunday, May 5, 2024

బాబాసాహెబ్‌ పురందరే కన్నుమూత

ప్రముఖ చరిత్రకారుడు, రచయిత బాబాసాహెబ్ పురందరే కన్నుమూశారు. జూలై 29న 99వ పుట్టినరోజు జరుపుకున్న ఆయన.. గత శనివారం బాత్‌రూంలో జారిపడ్డారు. దీంతో పూణేలోని దీననాథ్ మంగేష్కర్ ఆస్ప‌త్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం 5.07 గంటలకు తుదిశ్వాస విడిచారు. పూణేలోని వైకుంఠ శ్మశాన వాటికలో ఇవాళ ఉదయం 10.30 గంటలకు పురందరే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement