Sunday, May 5, 2024

అంబుడ్స్ మెన్ పై అజారుద్దీన్ ఫిర్యాదు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) లో మరోసారి వివాదాలు తెరపైకి వచ్చాయి. తాజాగా హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సస్పెన్షన్ కు గురైన కొంత మంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. HCA ప్రస్తుత కార్యవర్గాన్ని జింఖానా ఆఫీస్ లో అంబ్బుడ్స్ మెన్ వారు భయపెడుతున్నారు ఆరోపించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షు డు అజారుద్దీన్ కు.. అంబుడ్స్ మెన్ మధ్య గత కొద్దీ రోజులుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో నడుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement