Wednesday, May 1, 2024

పాప్ కార్న్ తో తొలి అడుగు వేశా – అవికా గోర్

అవికా గోర్‌ మనకు ‘చిన్నారి పెళ్లికూతురు’గా, ‘ఉయ్యాలజంపాలా ‘ హీరోయిన్‌గానూ తెలుసు. ఇప్పుడు ‘పాప్‌కార్న్‌’ సినిమాలో హీరోయిన్‌గా నటించటమే కాకుండా నిర్మాతగానూ పరిచయమవుతున్నారు. అవికా గోర్‌, సాయి రోనక్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ‘పాప్‌ కార్న్‌’. మురళి గంధం దర్శకత్వంలో భోగేంద్ర గుప్తా (నెపోలియన్‌, మా ఊరి పొలిమేర చిత్రాల నిర్మాత) ఈ సినిమాను నిర్మించారు. పాప్‌కార్న్‌ గురించి, అందులో నటన, నిర్మాణం గురించి చాలా విషయాలు పంచుకున్నారు అవికాగోర్‌.


పాప్‌కార్న్‌ సినిమా ఎలా మొదలైంది?
మా దర్శకుడు మురళి ఈ స్క్రిప్ట్‌తో వచ్చారు. కాన్సెప్ట్‌ గురించి చెప్పారు. చాలా బాగుందనిపించింది. 90 శాతం లిప్ట్‌n లో జరిగే కథ ఇది. ఓ నటిగా నాకు చాలా చాలెంజింగ్‌గా అనిపించింది.
కథ నచ్చి ప్రొడ్యూస్‌ చేశారా?
నేను నిర్మాతని కావాలని ఎప్పటి నుంచో అనుకున్నా. ఈ సినిమా కథ వినగానే, ఇదే పర్ఫెక్ట్‌ -టైమ్‌ అనిపించింది. అందుకే మొదటి అడుగు వేశాను.
స్క్రిప్ట్‌లో ఏమైనా ఐడియాలు షేర్‌ చేసుకున్నారా?
లేదు. డైరక్టర్‌కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశాం. దర్శకులు వాళ్ల మనసులో ఉన్న విషయాలను స్క్రీన్‌ మీద అందంగా చూపించగలరు. నేనైతే కథాపరంగా ఎలాంటి సలహా ఇవ్వలేదు.
సినిమా చూశాక పరిశ్రమకు చెందిన వాళ్లు ఏమన్నారు?
నాగార్జున, చైతన్య, నిఖిల్‌.. వీళ్లందరూ చాలా ఆనందంగా ఫీలయ్యారు. పోస్టర్‌ చూసినప్పుడు, నేను వాళ్లతో ఈ విషయం చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యారు.
ఎప్పుడైనా లిప్టలో స్ట్రక్‌ అయ్యారా?
లేదండీ. అసలు ఎందుకు కావాలి? ఒకవేళ ఎప్పుడైనా లిప్టలో నేను స్ట్రక్‌ అయితే, నా పక్కన సాయిరోనక్‌ ఉండాలి. ఎందుకంటే, నన్ను ఎలా బయటకు తీసుకురావాలో అతనికే తెలుసు కాబట్టి.
తెలుగులోకి వచ్చి పదేళ్లవుతోంది. మీరు హ్యాపీయేనా?
చాలా హ్యాపీ. చాలా మంచి పాత్రలు చేశా. థాంక్యూలో నేను చైకి రాఖీ కట్టాను. చాలా మంచి కేరక్టర్‌ అది. హ్యాష్‌ట్యాగ్‌ బ్రో వల్ల మనిషిగా నాలో చాలా మార్పులొచ్చాయి. ఏ పాత్ర చేసినా దాని వల్ల మనలో మార్పు చూసుకుంటాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement