Sunday, May 5, 2024

ఆసీస్ భారీ విజయం.. రెండో ఇన్నింగ్స్‌లో 192పరుగులకే ఇంగ్లండ్‌ ఆలౌట్‌..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌లో ఆసీస్‌ వరుసగా రెండో టెస్టులోనూ ఘనవిజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో రెండో టెస్టును 275పరుగుల భారీ తేడాతో గెలుచుకుంది. 82/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో చివరిరోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ 192పరుగులు చేసి ఆలౌటైంది. ఆసీస్‌ పేసర్‌ జై రిచర్డ్‌సన్‌ 5వికెట్లుతీసి ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించాడు. రిచర్డ్‌సన్‌ 42పరుగులిచ్చి 5వికెట్లు తీయగా, స్టార్క్‌ 43పరుగులుకు 2వికెట్లు, మైకేల్‌ నేసర్‌ 55పరుగులుకు 2వికెట్లు పడగొట్టారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్‌సెంచరీతో ఆసీస్‌ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన లబుషేన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కించుకున్నాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా 2-0ఆధిక్యంలో నిలిచింది.

చివరి మూడు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టు ఇదే…
యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో జరగనున్న చివరి మూడు టెస్టులకు జట్టును క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. కెప్టెన్‌ కమిన్స్‌, హేజిల్‌వుడ్‌ తిరిగి జట్టులోకి వచ్చారు. చివరి మూడు టెస్టులు మెల్‌బోర్న్‌, సిడ్నీ, హోబర్ట్‌ వేదికలుగా జరగనున్నాయి. పాట్‌కమిన్స్‌ (కెప్టెన్‌), స్మిత్‌ (వైస్‌కెప్టెన్‌), కారీ, కామెరూన్‌ గ్రీన్‌, హేజిల్‌వుడ్‌, మార్స్‌స్‌ హారిస్‌, హెడ్‌, ఉస్మాన్‌ ఖవాజా, లబుషేన్‌, లియన్‌, నేసర్‌, రిచర్డ్‌సన్‌, స్టార్క్‌, వార్నర్‌, స్వెప్సన్‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement