Tuesday, May 7, 2024

పెళ్ళి మండపంలో అత్త దమ్మారో… దమ్.. వివాహం క్యాన్సిల్ అన్న అల్లుడు

లక్నో : తన కాబోయే అత్తగారు సిగరెట్‌ తాగుతూ డాన్స్‌ చేయడాన్ని చూసిన పెండ్లి కొడుకు తనకీ పెళ్లి వద్దంటూ వెళ్లిపోయాడు. యూపీలోని సంభాల్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి పెళ్లి నిశ్చయమైంది. జూన్‌ 27న కల్యాణ మండపానికి చేరిన వరుడు వివాహానికి మందు జరిగిన వేడుకలో తన కాబోయే అత్తగారు సిగరెట్‌ తాగుతూ డాన్స్‌ చేయడాన్ని చూసి షాక్‌ తిన్నాడు..

సభ్యత, సంప్రదాయం లేకుండా సిగరెట్‌ తాగడమేమిటని ఆగ్రహించిన పెండ్లి కొడుకు వెంటనే వేడుకను నిలిపివేయించి పెళ్లిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించి తన బంధువులతో మండపం నుంచి నిష్క్రమించాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement