Thursday, May 2, 2024

పెళ్లి వేడుకలో దారుణం.. ఉమ్మితో నాన్​రోటీ తయారీ

ఘజియాబాద్‌లోని మోదీనగర్‌లో ఒక వ్యక్తి తన లాలాజలంతో నాన్‌ రోటీ తయారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో గోవింద్‌పురి కాలనీలో జరిగిన వివాహ వేడుకకు సంబంధించినదిగా గుర్తించారు. ఇక్కడ వ్యక్తి తన లాలాజలాన్ని ఉపయోగించి నాన్‌ రోటీ తయారు చేయడం స్పష్టంగా కనిపిస్తోందని, ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు.

కాగా, వీడియోలో నిందితుడు తాండూర్‌పై వంట చేయడానికి ముందు తన లాలాజలాన్ని దానిపై ఉంచి నాన్‌ను తయారు చేయడం చూడవచ్చు. రెండు రోజుల క్రితం తీసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని, గత సంవత్సరం, దౌసా బంజర్‌పూర్ గ్రామం నుండి ప్రజలు నాన్ పిండిపై ఉమ్మివేస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను జైలుకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement