Sunday, April 28, 2024

ఏపీ సచివాలయం ఉద్యోగుల్లో కరోనా భయం

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉగ్రరూపం దాల్చింది. రోజువారీ కేసుల సంఖ్య ఇప్పటికే ఆరు వేలు దాటింది. రోజు రోజుకీ మరణాలు అధికంగా నమోదు అవుతున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ పాలనకు కేంద్రమైన సచివాలయంలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే 60 మందికి పైగా ఉద్యోగులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా పాజిటివ్ గా తేలింది. ఇప్పటికే ఆర్ధిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీలో పనిచేసిన పద్మారావు కరోనాతో మృతి చెందారు. దీంతో సచివాలయ అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని శాఖల సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే 200 మంది ఉద్యోగులకు కరోనా టెస్టులు నిర్వహించగా.. మరింత మందిని పరీక్షించేందుకు కిట్లు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయం ఉద్యోగులు విధులకు రావాలంటేనే భయపడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇవ్వాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వైరస్ తమతో పాటు కుటుంబ సభ్యులకు కూడా సోకుతోందని.. ప్రభుత్వం తమ విజ్ఞప్తిని పట్టించుకోవాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement