Friday, March 29, 2024

సహాయం అవసరమైతే నన్ను సంప్రదించండి..

బెల్లంపల్లి : పట్టణ ప్రజలంతా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ మొదలైందని, బెల్లంపల్లి పట్టణంలో కూడా కరోనా వైరస్‌ త్వరితగతిన వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు పాటించి పట్టణ ప్రజలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే బాధ్యత కౌన్సిలర్లపై, కోఆప్షన్‌ సభ్యులపై ఉందని చెప్పారు. ప్రతీ వార్డులో కరోనా వైరస్‌ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజలంతా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించేలా కృషి చేయాలని, కరోనా వ్యాక్సిన్‌ను ప్రతీ ఒక్కరు వేసుకునేలా ప్రచారం చేయాలని, మీ వార్డుల్లో ఎవరికైనా కరోనా వైరస్‌ సోకి ఉంటే సమీప వైద్యుడిని సంప్రదించేలా చూడాలని చెప్పారు. పట్టణంలో ఎవరికైనా కరోనా సోకి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే వెంటనే నన్ను స్వయంగా సంప్రదించవచ్చునని, లేదా సెల్‌ : 9866242008 నెంబర్‌కు ఫోన్‌ చేసి సంప్రదించాలని ఎమ్మెల్యే సూచించారు. పట్టణంలోని ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని, కరోనా వైరస్‌ బారీన పడకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement