Monday, June 5, 2023

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం ఓ శుభవార్త తెలిపింది. జగనన్న వసతి దీవెన ,విద్య దీవెన పథకాలకు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ గడువును పొడిగించింది. ఈ నెల 28వ తేదీ వరకు ఆ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ రెండు పథకాలకు ముందుగా ఈనెల 25 వరకే గడువు ఇచ్చారు. కాగా ఇంకా పలువురు విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకోకపోవడంతో గడువును ఏపీ ప్రభుత్వం పెంచింది. వసతి దీవెన కింద విద్యార్థులకు కోర్సును బట్టి 10 వేల నుంచి 20 వేల వరకు హాస్టల్ ఫీజు… విద్య దీవెన కింద ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇవ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement