Friday, April 26, 2024

ప్రతి మహిళ దిశ యాప్ వాడాలి: డీజీపీ సవాంగ్

అమరావతి: శనివారం రాత్రి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఓ యువతిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన అత్యంత హేయకరమని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అభిప్రాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను పట్టుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఇప్పటికే కృష్ణ, గుంటూరు జిల్లా ఎస్పీలు, విజయవాడ కమిషనర్‌లకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.

ఇటువంటి అమానవీయ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని డీజీపీ అన్నారు. నేరానికి పాల్పడిన నిందితులు ఎంతటివారైనా ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. మహిళల భద్రత తమ ప్రథమ కర్తవ్యమని, ఎన్నో చర్యలు చేపట్టినా, ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మహిళ దిశ యాప్‌ను ఖచ్చితంగా వాడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement