Monday, April 29, 2024

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు అరెస్ట్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క్యాసినో వ్య‌వ‌హ‌రంలో ఏపీలో రాజకీయాలు మరింత హీటెక్కాయి. కృష్ణా జిల్లా గుడివాడ వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు.. ఇతర సీనియర్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. నందమూరు దగ్గర.. నేతలను నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే.. తాము సంక్రాంతి సంబరాలు ప్రజలకు తెలియజేసేందుకే గుడివాడ వెళ్తున్నామని.. మరో కారణం లేదని సోము వీర్రాజుతో పాటు.. బీజేపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గుడివాడలో 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా అనుమతించేది లేదంటూ పోలీసులు తేల్చి చెప్పారు. చివరికి.. కలువపాముల ప్రాంతంలో సోము వీర్రాజుతో పాటు.. ఇతర బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ప్రాంతం నుంచి తరలించారు. పోలీసుల చర్యను బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ఆందోళనలు, ధర్నాలు చేయడానికి కాదని.. వేడుకలు చేసేందుకు వెళ్తున్నామని.. అయినా అరెస్ట్ చేయడం ఏంటని.. ఆగ్రహం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement