Wednesday, March 27, 2024

ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం స్టాలిన్

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తమిళనాడు మత్స్యకారులకు చెందిన బోట్లను శ్రీలంక ప్రభుత్వం వేలం వేస్తోందని, దీన్ని భారత ప్రభుత్వం అడ్డుకోవాలని కోరారు. తమిళనాడు మత్స్యకారులకు చెందిన 105 బోట్లు శ్రీలంక ప్రభుత్వం అధీనంలో ఉన్నాయని తెలిపారు. వాటిని ఫిబ్రవరి 7 నుంచి 11వ తేదీ వరకు వేలం వేసేందుకు శ్రీలంక ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని పేర్కొన్నారు. ఎలాంటి సంప్రదింపులు లేకుండానే బోట్లను వేలం వేసేందుకు పత్రికా ప్రకటనలు ఇస్తోందని ఆరోపించారు. ఈ బోట్లను కోల్పోతే పేద మత్స్యకారుల జీవితాలు మరింత దుర్భరం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బోట్లను విడుదల చేయాలని శ్రీలంక న్యాయస్థానాలు కూడా ఆదేశాలు ఇచ్చాయన్న విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.

ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని శ్రీలంక నిర్ణయంపై భారత కేంద్రం ప్రభుత్వం తన అసంతృప్తిని బలంగా వ్యక్తపరచాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. బోట్ల వేలం కోసం పత్రికల్లో ఇచ్చిన ప్రకటన రద్దు చేసేలా ఒత్తిడి తేవాలని కోరారు. కోర్టులు విడుదల చేసిన బోట్లను ఎలా వేలం వేస్తారన్న అంశాన్ని శ్రీలంక సర్కారు దృష్టికి తీసుకెళ్లాలని స్టాలిన్ లేఖలో విన్నవించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement