Sunday, May 12, 2024

అనుప‌మ బ‌ట్ట‌ర్‌ఫ్లై టీజ‌ర్‌.. ఎల్లుండి రిలీజ్ చేస్త‌ర‌ట‌..

అనుప‌మ పుట్టినరోజు సందర్భంగా తాను న‌టిస్తున్న తాజా సినిమా బటర్‌ఫ్లై ఫస్ట్‌లుక్ ఇటీవ‌లే విడుదల చేశారు. ఘంటా సతీష్ బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్‌పై రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీత బాధ్యతలను అర్విజ్‌, గిడియన్‌ కట్టా అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది..

కాగా, ఈ సినిమా టీమ్ నుంచి మ‌రో అప్ డేట్ వ‌చ్చింది.. సినిమాకి సంబందించిన టీజ‌ర్ రిలీజ్ డేట్ ను చెప్పేశారు మేక‌ర్స్..

“Butterfly అందరినీ మంత్రముగ్ధులను చేసే మార్గంలో ఉంది. అందమైన టీజర్ కోసం సిద్ధంగా ఉండండి. మార్చి 3వ తేదీ @ 11:11 AM” అంటూ అధికారిక సోష‌ల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేశారు మూవీ టీమ్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement