Thursday, May 9, 2024

$800 K కంటే ఎక్కువ వసూలు చేసిన – అంటే ..సుంద‌రానికీ

ఈ నెల 10న విడుద‌ల‌యింది అంటే ..సుంద‌రానికీ చిత్రం.. కాగా ఈ చిత్రంలో కామెడీ పాళ్లు పెంచారు ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ‌.ఈ సినిమాలో కామెడీ పాళ్లు ఎక్కువ .. రొమాన్స్ పాళ్లు కలపనేలేదు. నజ్రియా ఈ సినిమాకి ప్లస్ అవుతుందని టీమ్ అనుకుంది. కానీ ఆమెనే మైనస్ అనే టాక్ పబ్లిక్ లో నుంచి వచ్చింది. ఇక పాటలు కూడా అంతంత మాత్రంగానే అనిపించడం వలన ఆడియన్స్ కాస్త డీలాపడ్డారు. లేకపోతే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేదే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.హీరో నాని – నజ్రియా జంటగా న‌టించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోయినా, ఆ తరువాత పుంజుకున్నాయని అంటున్నారు. ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్లు నిలకడగానే ఉన్నాయని చెబుతున్నారు. ఇంతవరకూ ఈ సినిమా $800 K కంటే ఎక్కువ వసూలు చేసిందని అంటున్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ సినిమా 1 మిలియన్ డాలర్ల మార్కును టచ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement