Monday, April 29, 2024

బెంగ‌ళూరు ఖాతాలో మ‌రో విజ‌యం.. హ‌స‌రంగ బౌలింగ్ లో స‌న్ రైజ‌ర్స్ చిత్తు..

వాంఖడే స్టేడియంలో ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ కు పరాజయం తప్పలేదు. ఆర్సీబీ (రాయ‌ల్ చాలేంజ‌ర్స్ బెంగ‌లూరు) విసిరిన 193 పరుగల లక్ష్యఛేదనలో 67 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమి సన్ రైజర్స్ కు వరుసగా నాలుగోది. ఇప్పటివరకు 11 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ 6 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. దీంతో సన్ రైజర్స్ ప్లే ఆఫ్ ఆశలు దాదాపు అడుగంటిపోయాయి. హసరంగ త‌న బౌలింగ్ తో సన్ రైజర్స్ పై విరుచుర‌కప‌డ్డాడు.. హసరంగ బౌలింగ్ కు రావడంతో సన్ రైజర్స్ కష్టాలు రెట్టింపయ్యాయి. 5 వికెట్లు తీసి సన్ రైజర్స్ ను దెబ్బతీశాడు.. దాంతో, సన్ రైజర్స్ 19.2 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌట్ అయింది. క్రీజులో కుదురుకున్న మార్ క్రమ్, పూరన్ లను అవుట్ చేసిన హసరంగ… బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

రాహుల్ త్రిపాఠి 37 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు చేయగా, అయిడెన్ మార్ క్రమ్ 21, పూరన్ 19 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఓపెనర్ కేన్ విలియమ్సన్ ఒక్క బంతి కూడా ఆడకుండానే రనౌట్ రూపంలో వెనుదిరగ్గా, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (0) మ్యాక్స్ వెల్ బౌలింగ్ లో ఔట‌య్యాడు. ఇక, జోష్ హేజెల్ వుడ్ కు 2 వికెట్లు.. గ్లెన్ మ్యాక్స్ వెల్ కు 1 వికెట్ హర్షల్ పటేల్ 1 వికెట్ తీసి బెంగ‌ళూరును విజ‌యం వైపు న‌డిపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement