Sunday, May 5, 2024

సింగ‌ర్ సోనూ నిగ‌మ్ పై మ‌రోసారి దాడి.. వైర‌ల్ గా వీడియో

మ‌రోసారి స్టార్ సింగ‌ర్ సోనూ నిగ‌మ్ పై దాడి జ‌రిగింది. ముంబైలోని చెంబూరులో నిర్వహించిన సంగీత్‌ కచేరిలో తన బృందంతో కలిసి సోనూ నిగమ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెట్లపై నుంచి దిగి వ‌స్తున్న సోనూ నిగమ్‌తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఒక్కసారిగా జనం దూసుకురావడంతో సెల్ఫీలు దిగేందుకు సెక్యూరిటీ నిరాకరించారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో సోనూ నిగమ్‌ స్నేహితుడు రబ్బానీ ఖాన్‌ను కిందపడేశారు. అప్పుడే సెక్యూరిటీతో పాటు సోనూ నిగమ్‌పై కూడా దాడి జరిగినట్లు వీడియోలో తెలుస్తోంది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం సోనూ నిగమ్‌ సురక్షితంగానే ఉన్నారు. అయితే ఇది నిజంగా తోపులాటేనా లేదా ప్లాన్‌ ప్రకారం దాడికి యత్నించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement