Sunday, May 19, 2024

లియాండర్‌ పేస్‌తో యానిమేటెడ్ షో.. గ్రీన్‌ గోల్డ్‌ స్టూడియో రూపకర్త లిటర్‌ లియాండర్‌గా నామకరణం..

హైదరాబాద్‌ : భారతదేశ సొంత యానిమేషన్‌ సిరీస్‌ ఛోటా భీమ్‌ 14 ఏళ్లుగా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్నది. ఈ సిరీస్‌ వెనుక ఉన్న గ్రీన్‌ గోల్డ్‌ యానిమేషన్‌ స్టూడియో ఇప్పుడు.. లెజండరీ టెన్నిస్టార్‌ లియండర్‌ పేస్‌తో అతని జీవిత కథపై యానిమేషన్‌ సిరీస్‌ చేయనుంది. తాత్కాలింగా ఈ యానిమేషన్‌ సిరీస్‌కు లిటిల్‌ లియాండర్‌గా నామకరణం చేసింది. ఈ యానిమేటెడ్‌ సిరీస్‌ లియాండర్‌ జీవితం, ఎదుర్కొన్న సవాళ్లు, గ్రేటెస్ట్‌ టెన్నిస్‌ స్టార్‌లలో ఒకరిగా, గ్లోబల్‌ ఐకాన్‌గా మారే ప్రయాణంలో అతని చిన్ననాటి అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. 8 కెరీర్‌ గ్రాండ్‌ స్లామ్‌ డబుల్స్‌ టైటిల్స్‌ను, 10 కెరీర్‌ గ్రాండ్‌ స్లామ్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఛాంపియన్‌షిప్‌లతో టెన్నిస్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరిగా నిలిచాడు. మాజీ డబుల్స్‌ ప్రపంచ నెంబర్‌ వన్‌ ఆటగాడిగా టెన్నిస్‌ కోర్టులో ఉంటూ, వెలుపల స్ఫూర్తిదాయకంగా ఉన్నాడు. గ్రీన్‌ గోల్డ్‌ యానిమేషన్‌ వ్యవస్థాపకుడు రాజీవ్‌ చిలక మాట్లాడుతూ.. మిస్టర్‌ లియాండర్‌ పేస్‌తో కలిసి పని చేయడం ఎంతో గౌరవంగా ఉందన్నారు.

లియాండర్‌ పేస్‌గా మారడం అంత సులభం కాదన్న ఆయన.. లిటిల్‌ లియాండర్‌తో తాము ఐకాన్‌, విజేత, ప్రపంచ నెంబర్‌ 1 వెనుక ఉన్న అంశాలను ప్రదర్శించాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఆహ్లాదకరమైన, మధురమైన, కష్టమైన క్షణాలను రాబట్టాలని ఆశిస్తున్నామని వివరించారు. అనంతరం లియాండర్‌ పేస్‌ మాట్లాడుతూ.. ఈ షోతో తాను థ్రిల్‌గా ఉన్నట్టు తెలిపాడు. ఇది ఒక విధంగా తన వారసత్వం అని చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్‌ ద్వారా యువతను కమ్యూనికేట్‌ చేయగలనని వివరించారు. సానుకూల అభివృద్ధి వైపు వారిని ప్రేరేపించడానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు. పైలట్‌/టీజర్‌ మూడు నెలల్లో సిద్ధం అవుతుందని భావిస్తున్నట్టు వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement