Sunday, April 28, 2024

ANIMAL Pre-Teaser : ఏంటీ ర‌క్త‌పాతం

బాలీవుడ్ హీరో ర‌ణ్ బీర్ క‌పూర్ తో ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి యానిమాల్ అనే వైలెంట్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. మరో రెండు నెలల్లో విడుదల కానున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రివేంజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 11న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.తాజాగా చిత్రబృందం ఈ సినిమా ప్రీ టీజర్ ను రిలీజ్ చేసింది. లేటెస్ట్ గా రిలీజైన ప్రీ టీజర్ వేరే లెవల్లో ఉంది. మాస్క్ పెట్టుకుని ఉన్న ఒక గ్రూప్ ను గొడ్డలి పట్టుకుని నరకుతూ భీభత్సం సృష్టించాడు. ప్రీ టీజర్ తోనే సినిమాపై తిరుగులేని హైప్ ఏర్పడింది. త్వరలో టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సినిమా రిలీజ్ కు రెండు నెలల టైమ్ ఉందని చెబుతూ ఈ సినిమా ప్రీ టీజర్ ను రిలీజ్ చేశారు.గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తు్ంది. బాలీవుడ్ స్టార్ అనీల్ కపూర్.. రణ్ బీర్ క‌పూర్ కి ఫాదర్ గా కనిపించనున్నాడు. ఇటీవలే రణ్‌బీర్‌ కపూర్‌ కు సంబంధించిన కొన్ని ఫోటోలు లీకై నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అందులో క్లీన్ షేవ్ తో ఉన్న రణ్‌బీర్‌ లుక్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో రణ్‌బీర్‌ ఫిజిక్స్ లెక్చరర్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement