Sunday, May 5, 2024

Asia cup Hockey | మ‌రి కొద్ద సేప‌ట్లో బంగ్లాదేశ్‌తో భార‌త్ ఢీ

ఒమన్‌లోని సలాలాలో ఇవ్వాల‌ (మంగళవారం) జ‌ర‌గ‌నున్న‌ మెన్స్ ఆసియా హాకీ 5 ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌లో భారత పురుషుల జట్టు బంగ్లాదేశ్‌తో తన ప్రారంభ పోటీని ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ 7.30 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. ఇక‌, బంగ్లాదేశ్‌తో ఇవ్వాల‌ జర‌గ‌నున్న‌ పోటీ తర్వాత, ఆగస్టు రేపు (బుద‌వారం) ఒమన్, పాకిస్థాన్‌లతో భారత్ పోటీపడుతుంది. ఆపై ఆగస్టు 31న మలేషియా, జపాన్‌లతో తలపడనుంది. కాగా, వ‌చ్చే ఏదాది (2024) హాకీ 5s ప్రపంచ కప్‌లో మొత్తం 16 దేశాలు పోటీ పడనుండ‌గా.. ఆ గ్లోబల్ ఈవెంట్‌లో స్థానం పొందాలంటే.. ప్ర‌స్తుతం జ‌రుగున్న టోర్నీలో భారత్ మొదటి మూడు స్థానాల్లో చేరాల్సి ఉంది.

కాగా, ఈ ప్రపంచ కప్‌లో టోర్నీలో మెత్తం 12 జ‌ట్లు పోటీ ప‌డుతుండ‌గా.. రెండు గ్రూప్ లు(ఎలైట్ పూల్‌, ఛాలెంజర్స్ పూల్‌)గా విభజించారు. ఎలైట్ పూల్‌లో భార‌త్ లో పాటు.. మలేషియా, పాకిస్తాన్, జపాన్, ఒమన్ & బంగ్లాదేశ్‌లతో జ‌ట్లు ఉన్నాయి. అయితే, ఛాలెంజర్స్ పూల్‌లో హాంకాంగ్, చైనా, ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్ & ఇరాన్ జ‌ట్లు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement