Friday, December 6, 2024

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివ్‌ వార్‌.. పండుగ సీజన్‌లో ఆఫర్ల ఉత్సవం

ఇ-కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్‌, ప్లిnప్‌కార్ట్‌, మైంత్రాతోపాటు మరికొన్ని కంపెనీలు ఫెస్టిఫ్‌ సీజన్‌ ఆఫర్ల మేళాకు తెరలేపాయి. ఆదివారం భారతదేశంలో పండుగ సీజన్‌ అమ్మకాలను ప్రారంభించాయి. గతేడాదితో పోల్చితే ఇది పండుగ నెలలో ఆన్‌లైన్‌ స్థూల మర్చండైజ్‌ విలువ (జిఎంవి) విలువ 18-20 శాతం వరకు పెంచుతుందని అంచనా.

మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ రెడ్‌సీర్‌ ప్రకారం, సుమారు 140 మిలియన్ల దుకాణదారులచే నడపబడుతున్న ఆన్‌లైన్‌ విక్రేతలు, ముఖ్యంగా చిన్నవారు, పండుగల అమ్మకాలలో సంవత్సరానికి కనీసం 15శాతం జంప్‌ను ఆశిస్తున్నారు. సగటు వృద్ధి 26 శాతం పెరగొచ్చని స్ట్రాటజీ కన్సల్టెంట్స్‌ భావిస్తున్నారు.

అమెజాన్‌ ఇండియా

- Advertisement -

పండుగ సీజన్‌ కోసం తన కార్యకలాపాల నెట్‌వర్స్‌లో 100,000 కంటే ఎక్కువ కాలానుగుణ ఉద్యోగ అవకాశాలను సృష్టించింది. ముంబై, ఢిల్లి, పూణే, బెంగళూరు, #హదరాబాద్‌, కోల్‌కతా, లక్నో, చెన్నై వంటి నగరాల్లో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు ఈ జాబితాలో ఉన్నాయి. అమెజాన్‌ బిగ్‌ ఫ్యాషన్‌ ఫెస్టివల్‌, ఇప్పుడు 6,000 ప్రముఖ అంతర్జాతీయ, దేశీయ, డి2సి బ్రాండ్‌ల నుండి 23 లక్షలకు పైగా ఫ్యాషన్‌, కాస్మొటిక్‌, జీవనశైలి ఉత్పత్తులతో విక్రయాలకు సిద్ధమైంది.

ఫెస్టివ్‌ సీజన్‌ సందర్భంగా, కస్టమర్‌లకు వేలాది దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్‌లపై ఆఫర్లు అందుబాటు లో ఉండనున్నాయి. అలాగే వారి పండుగ సందర్భంగా మరింత విలువను అన్‌లాక్‌ చేయడానికి కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌తో కలిసి మైంత్రా సహ-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డ్‌పై అదనంగా 15 శాతం తగ్గింపును పొందుతారు.

స్నాప్‌డీల్‌

పండుగ సీజన్‌ సేల్‌ను ‘తూఫానీ సేల్‌- ఫెస్టివ్‌ ధమాకా’ పేరుతో అక్టోబర్‌ 8-15 వరకు ప్రారంభించింది. కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ శామ్‌సంగ్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పండుగ సీజన్‌ కోసం విస్తృత శ్రేణి టెలివిజన్‌లపై మెగా డీల్‌లను విడుదల చేసింది. క్యుఎల్‌ఈడీ టీవీ, ఒఎల్‌ఈడీ టీవీ, క్రిస్టల్‌ 4కె ఐ స్మార్ట్‌ టీవీ, క్రిస్టల్‌ విజన్‌ 4కె టీవీ, క్యు ఎల్‌ఈడీ 4కె టీవీ, ద ఫ్రేమ్‌టీవీ తదితర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై ఆఫర్లు అందిస్తున్నది.

అద్భుతమైన ఆఫర్‌ల ద్వారా మా కస్టమర్‌లకు ఈ పండుగ ఆనందాన్ని ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాము. మా ప్రత్యేకమైన ఆఫర్‌లు ఈ పండుగ సీజన్‌కు మరింత ఆనందాన్ని ఇస్తాయని మేము విశ్వసిస్తున్నాము అని శాంసంగ్‌ ఇండియా విజువల్‌ డిస్‌ప్లే బిజినెస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మో#హన్‌దీప్‌ సింగ్‌ అన్నారు.

ఫ్లిప్‌కార్ట్‌

ప్రముఖ ఆన్‌లైన్‌ రిటైలర్‌ ప్లిnప్‌కార్ట్‌తో ప్రత్యేక భాగస్వామ్యంతో, జర్మన్‌ ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ అయిన బ్లౌపన్‌కార్ట్‌ ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ సందర్భంగా మొత్తం శ్రేణి టీవీలపై భారీ తగ్గింపులను ప్రకటించింది. కస్టమర్‌లకు స్మార్ట్‌ టీవీలు, ఉపకరణాలపై 80 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. సరికొత్త టీవీలు రూ. 6,299 ఆకర్షణీయమైన ధరతో ప్రారంభమవుతాయి. కొత్తగా ప్రారంభించబడిన 43-అంగుళాల క్యుఎల్‌ఈడీ రూ. 28,999 వద్ద అందుబాటులో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement