Friday, May 3, 2024

బిడ్డా సప్పుడు చెయ్యకు.. ‘భగవంత్‌ కేసరి’ ట్రైలర్‌ వచ్చేసింది..

అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాల‌కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ మూవీ భగవంత్ కేసరి. ఎప్పుడెప్పుడొస్తుందా.. అని ఎదురుచూస్తున్న ఈ మూవీ ట్రైలర్ రానే వచ్చింది. హన్మకొండలోని యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్‌ అండ్ సైన్స్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌ ట్రైలర్‌ లాంఛ్‌ చేశారు.

YouTube video

ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. బాలకృష్ణ, శ్రీ లీల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. అయితే ట్రైలర్ లో డైరెక్టర్ బాలకృష్ణ ను ఎలివేట్ చేసిన విధానం వేరే లెవెల్ లో ఉన్నాయి. ఒక పక్క జోవియల్ గా ట్రైలర్ సాగుతూనే ఉన్నా, విలన్ అర్జున్ రాంపాల్ కి చెమటలు పట్టించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి. కాజల్ అగర్వాల్ సీన్స్ హీరో బాలయ్యను ఎలివేట్ చేస్తూ వేరే లెవెల్ లో ఉన్నాయి. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత హైలైట్ గా ఉంది.

బాలకృష్ణ ఈ చిత్రంలో నేలకొండ భగవంత్ కేసరిగా పక్కా తెలంగాణ యాస, భాషలో మాస్ అవతారాన్ని చూపించేందుకు రెడీ అవుతున్నట్టు ఇప్పటికే టీజర్‌ ద్వారా హింట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. మరోవైపు భగవంత్‌ కేసరి నుంచి విడుదల చేసిన గణేశ్‌ ఆంథెమ్‌, ఉయ్యాలో ఉయ్యాలా నెట్టింట మంచి వ్యూస్ రాబడుతూ.. అందరినీ ఇంప్రెస్ చేస్తున్నాయి.

ఈ మూవీలో కాజల్ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటిస్తున్నాడు. భగవంత్ కేసరి అక్టోబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. షైన్‌ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్‌ థమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement