Wednesday, May 8, 2024

Exclusive | వికెట్ కాపాడుకుంటూనే.. స్కోరుబోర్డుని పరుగులుపెట్టిస్తున్న కోహ్లీ, రాహుల్​

వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఫ‌స్ట్‌ మ్యాచ్‌లోనే 2 పరుగులకే 3వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డిన టీమిండియాని విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ ఆదుకున్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కి 100 ప‌రుగుల భాగస్వామ్యం నెలకొల్పారు..

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

మ్యాచ్​లో 30 ఓవర్లు ముగిసి డ్రింక్స్​ బ్రేక్​ సమయానికి 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా 120 పరుగులు చేసింది.  విజయానికి ఇంకా 20 ఓవర్లు, 120 బంతుల్లో 80 పరుగులు చేయాల్సి ఉంది. కాగా, విరాట్ కోహ్లీ 90 బంతుల్లో 4 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేయగా, కెఎల్ రాహుల్ 81 బంతుల్లో 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ బాదాడు. విరాట్ కోహ్లీ వన్డే కెరీర్‌లో ఇది 67వ హాఫ్ సెంచరీ కాగా, కెఎల్ రాహుల్ కెరీర్‌లో 16వ హాఫ్ సెంచరీ..

ఇక.. వన్డేల్లో మూడో స్థానంలో 11 వేల పరుగులు పూర్తి చేసుకున్న కోహ్లీ, రికీ పాంటింగ్ తర్వాత ఈ ఫీట్ సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. రికీ పాంటింగ్, వన్డేల్లో 12,662 పరుగులు చేసి టాప్‌లో ఉన్నాడు. నాన్‌-ఓపెనర్‌గా ఐసీసీ వరల్డ్ కప్‌ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ నిలిచాడు విరాట్ కోహ్లీ.. కోహ్లీ 2205 పరుగులు చేస్తే, ఇంతకుముందు కుమార సంగర్కర 2193 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్, ఐసీసీ వైట్ బాల్ టోర్నీల్లో 2719 పరుగులు చేస్తే, విరాట్ కోహ్లీ ఆ రికార్డును అధిగమించేశాడు..  

అంతకుముందు 200 పరుగుల లక్ష్యఛేదనతో బ్యాటింగ్ మొదలెట్టిన  టీమిండియా 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్, స్లిప్‌లో కామెరూన్ గ్రీన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 6 బంతులు ఆడిన రోహిత్ శర్మ, హజల్‌వుడ్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు.. శ్రేయాస్ అయ్యర్ కూడా 3 బంతులు ఆడి హజల్‌వుడ్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కేవలం 2 ఓవర్లు ముగిసే సమయానికి 2 పరుగులు మాత్రమే చేసిన టీమిండియా, 3 టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. టీమిండియా చేసిన 2 పరుగులు కూడా ఎక్స్‌ట్రాల రూపంలోనే రావడం విశేషం.  అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులకి ఆలౌట్ అయ్యింది..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement