Friday, April 26, 2024

నిషేధిత ప్లాస్టిక్ యూనిట్లకు ప్రత్యామ్నాయ మార్గాలు.. విజయసాయి రెడ్డి ప్రశ్నపై కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ యూనిట్లకు ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం సూక్ష్మ, చిన్, మధ్య తరహరా పరిశ్రమల మంత్రిత్వశాఖ ద్వారా పలు పథకాలు అందిస్తోందని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే తెలిపారు. ఈ అంశంపై రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిచ్చారు. నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారు చేసే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సాంకేతిక అభివృద్ధి, అవగాహన, మార్కెటింగ్, మౌలిక సదుపాయాలు కల్పన వంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీని నిషేధిస్తూ 2021 ఆగస్టు 12న ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ 2022 జూలై 1 నుంచి ఆ ఆదేశాలను అమలు చేసినట్లు తెలిపారు. అయితే ప్రత్యామ్నాయ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు తయారీదార్లకు కొంత సమయం ఇచ్చాం. ప్రత్యమ్నాయ యూనిట్లు ఏర్పాటు ద్వారా కొత్త వ్యాపార మార్గాలు, కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రత్యమ్నాయ యూనిట్లు ఏర్పాటు చేసుకుంటున్న నిషేధిత ప్లాస్టిక్ తయారీ యూనిట్లుకు జీఎస్టీ రేట్లు సర్దుబాటు చేయాలని కోరుతూ జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్ సూచించినట్లు మంత్రి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement