Friday, April 19, 2024

ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో థ్రిల్ చేయనున్న సినిమాలివే

వీకెండ్ వచ్చిందటే చాలు సినీ ప్రేక్షకులకు పండగే.. కొత్త కొత్త సినిమాలతో థియేటర్లు హౌస్ ఫుల్ అవుతూనే ఉంటాయి.. ప్రతీ వారం లాగానే ఈ వారం కూడా తెలుగు ఆడియన్స్ ను అలరించేందుకు పలు సినిమాలు సిద్దంగా ఉన్నాయి. దీంతో పాటు తెలుగులో యంగ్ హీరోలు న‌టించిన ప‌లు సినిమాలు ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. విభిన్న‌మైన క‌థాంశాల‌తో కూడిన వెబ్‌సిరీస్‌లు ప్రేక్ష‌కుల్ని అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాయి. మరి ఈ వీకెండ్ లో ఓటీటీ, థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలేంటో ఒక్కసారి చూడండి..

ముఖచిత్రం – డిసెంబర్ 9

- Advertisement -

గంగాధర్ దర్శకత్వం వహించిన క్రైమ్ డ్రామా ‘ముఖచిత్రం’, ఈ మూవీలో యువ నటుడు విశ్వక్ సేన్ లాయర్‌గా ప్రత్యేక పాత్ర పోషించాడు. ఈ మూవీ ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌గా స్పందనే వచ్చింది.

గుర్తుందా సీతాకాలం – డిసెంబర్ 9

సత్యదేవ్,తమన్నా జంటగా.. నాగశేఖర్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ లవ్ డ్రామా ‘గుర్తుందా సీతకాలం’ డిసెంబర్ 9న విడుదల కానుంది.

విజయానంద్ – డిసెంబర్ 9

రిషికా శర్మ దర్శకత్వం వహించిన ‘విజయానంద్’ అనే కన్నడ సినిమా డిసెంబర్ 9న ఏకకాలంలో తెలుగులో కూడా విడుదలకు సిద్ధమైంది.

పంచతంత్రం – డిసెంబర్ 9

5 విభిన్న కథల మేళవింపుతో ఈ సినిమా ‘పంచతంత్రం’. ఈ చిత్రంలో బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్నారు.

ప్రేమదేశం – డిసెంబర్ 9

రొమాంటిక్ కామెడీ ‘ప్రేమదేశం’ శ్రీకాంత్ సిద్దం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

Ap04రామాపురం – డిసెంబర్ 9

క్రైమ్-థ్రిల్లర్ ‘ఏపీ04 రామాపురం’కి హేమారెడ్డి దర్శకత్వం వహించారు. అఖిలా ఆకర్షన్, రామ్ జక్కల ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు.

ఐ లవ్ యు ఇడియట్ – డిసెంబర్ 9

శ్రీలీల, విరాట్ జంటగా నటించిన ‘ఐ లవ్ యు ఇడియట్’.ఈ సినిమాకి ఏపీ అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు.

sony liv :

లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ / తెలుగు – డిసెంబర్ 9
సాక్షి / తమిళ్ – డిసెంబర్ 9
రాయ్ / మలయాళం – డిసెంబర్ 9

Zee5 :

మాచర్ల నియోజకవర్గం / తెలుగు – డిసెంబర్ 9
మాన్‌సూన్ రాగా / కన్నడ – డిసెంబర్ 9
మినీ / బెంగాలీ – డిసెంబర్ 9

Aha :

ఊర్వశివో రాక్షసివో / తెలుగు – డిసెంబర్ 9

Prime Video :

యశోద / తెలుగు – డిసెంబర్ 9

Netflix :

CAT / హిందీ – డిసెంబర్ 9
ఐ హేట్ క్రిస్మస్ / ఇంగ్లీష్ – డిసెంబర్ 9
గాడ్స్ క్రూకెడ్ లైన్స్ / ఇంగ్లీష్ – డిసెంబర్ 9

Hotstar :

ఫాల్ / హిందీ – డిసెంబర్ 9

Advertisement

తాజా వార్తలు

Advertisement