Monday, April 29, 2024

దారులన్నీ అరుణాచలమే.. ప్రైవేటు, ఆర్టీసీ బస్సుల్లో తరలిన భక్తులు

తమిళనాడులోని అరుణాచలంలో శివయ్యను దర్శించుకొనేందుకు భక్తులు క్యూ కట్టారు. తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడుపుతోంది. హైదరాబాద్ నుంచే కాకుండా తెలంగాణ లోని ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున బస్సుల్లో జనం తరలివెళ్తున్నారు.

గురు పౌర్ణమి పురస్కరించుకుని తిరువనమలై లోని అరుణాచలం గిరి ప్రదర్శన చేయడానికి ఎక్కువమంది వస్తున్నారు. అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవడం వల్ల అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అందుకని ప్రతి పౌర్ణమికి జరిగే గిరి ప్రదక్షణకు భక్త జనం తరలి వెళ్తున్నట్టు తెలుస్తోంది.

దీంతో తెలంగాణ ఆర్టీసీ కూడా స్పెషల్ బస్సులను నడుపుతోంది. ప్రతి ఒక్కరికి తక్కువ చార్జీతోనే అప్ అండ్ డౌన్ జర్నీ ప్లాన్ చేసారు ఆర్టీసీ ఎండి సజ్జనార్. ఇక ప్రైవేటు వాహనాలల్లో కూడా పెద్ద ఎత్తున జనం తరలినట్టు తెలుస్తోంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement