Friday, April 26, 2024

కెప్టెన్ గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న ఆల్ రౌండ‌ర్ బెన్ స్టోక్స్

ఇటీవ‌ల వ‌రుస టెస్ట్ సిరీస్‌ల్లో ఓట‌మి ఎదురుకావ‌డంతో మాజీ కెప్టెన్ జో రూట్ త‌న బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఐసీసీ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ పాయింట్ల ప‌ట్టిక‌లో ఇంగ్లండ్ క‌నిష్ట స్థాయిలో ఉంది. మాజీ కెప్టెన్ రూట్ 64 టెస్టులకు బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. దాంట్లో 27 గెలువ‌గా, 26 మ్యాచ్‌ల్లో ఓట‌మి పాల‌య్యారు. రూట్ విన్నింగ్ శాతం 42.18గా ఉంది. బెన్‌కు టెస్ట్ కెప్టెన్సీ బాధ్య‌త‌ల్ని అప్ప‌గించ‌డంలో త‌న‌కు ఎటువంటి ఇబ్బందిలేద‌ని జో రూట్ అన్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ జ‌ట్టుకు కెప్టెన్‌గా ఆల్ రౌండ‌ర్ బెన్ స్టోక్స్‌ను నియ‌మించారు. ఇంగ్లండ్ మెన్స్ జ‌ట్టుకు 81వ టెస్టు కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఈ ప్ర‌క‌ట‌న చేసింది. అయితే జూలైలో ఇండియాతో జ‌రిగనున్న‌ టెస్టు మ్యాచ్‌తో స్టోక్స్ సార‌థ్య బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.

బెన్ స్టోక్స్ 2013లో టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చారు.. 2017 ఫిబ్ర‌వ‌రిలో అత‌న్ని వైట్ కెప్టెన్‌గా ప్ర‌క‌టించారు. స్టోక్స్ టెస్ట్ యావ‌రేజ్ 35.89గా ఉండ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు టెస్టుల్లో 5061 ర‌న్స్ చేశాడు బెన్ స్టోక్స్.. బౌలింగ్‌లో స్టోక్స్ 174 వికెట్లు తీసుకున్నాడు. త‌న‌కు కెప్టెన్సీని అప్ప‌గించ‌డం గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు స్టోక్స్ తెలిపాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement