Sunday, May 5, 2024

నెగిటివ్ రోల్ లో క‌నిపించ‌నున్న‌ బాల‌య్య‌..!

నంద‌మూరి న‌ట సింహం బాలకృష్ణకు తన కెరీర్‌లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయాల‌ని కోరిక‌. ఆయ‌న‌ హీరోగా చేసే సినిమాలోనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయాలని అనుకుంటున్నట్లు బాలకృష్ణ ఇటీవల ఓ షోలో తెలిపారు. అయితే ఆయ‌న సినిమా సుల్తాన్ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రనే చేశాడు బాల‌య్య‌. అయితే నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేయాల‌న్న ఆయ‌న కోరికను నెరవేర్చేందుకు ముందుకొచ్చాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. తన తాజా చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో ఒకదానిని స్కెచ్ చేసినట్లు సమాచారం.

ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కూడా ఆయ‌న‌ కనిపిస్తాడని అంటున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. బాలకృష్ణ‌కు చెల్లెలుగా వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది. ఆమె నిశ్చితార్థానికి సంబంధించిన సన్నివేశాలను హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో చిత్రీకరిస్తున్న‌ట్లు సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం దసరాకు విడుదల కానుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ మ‌రో సినిమాలో నటించనున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement