Thursday, April 25, 2024

నా వ‌ల్ల సాయం అందితే చాలు… అలీ

హాస్య నటు-డు, ఆంధ్రప్రదేశ్‌ సమాచార శాఖ ముఖ్య సలహాదారు అలీ మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు- చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ”గతేడాది ఓ కార్యక్రమంకోసం ఆస్ట్రేలియా వెళ్లాను. అక్కడ ఉన్న మన తెలుగువారందరూ ఒకేమాట మీద ఉంటూ ఎంతోమం దికి సాయం చేయటం నా చూశాను. ఆరోజు అక్కడున్న మన తెలుగువారు విష్ణురెడ్డి, శశి కొలికొండను పిలిచి అడిగాను. మీరు ఆస్ట్రేలి యాలో ఉండి ఇంతమంచి చేస్తున్నారు కదా, అదేమంచి మన తెలుగువారికి కూడా చేయొచ్చు కదా అని అడిగాను. మరునాడు దాదాపు 60మందికి పైగా వచ్చి ఎలా సాయం చేయాలి? అని అడిగారు. ఆరోజు నేను కొన్ని సలహాలు సూచనలు ఇవ్వటంతో అందరూ సరే అన్నారు. 9 నెలల తర్వాత ఆర్వేన్సిస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీఇవో శశిగారు ఆర్వేన్సి స్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌కి సంబంధించిన ఆస్ట్రేలియన్‌ బ్రూస్‌ మ్యాన్‌ఫీల్డ్‌ ( డైరెక్టర్‌- గవర్నర్‌ అండ్‌ కంప్లేయిన్స్‌) ఇండియా కు తీసుకుని వచ్చారు. ఆ కంపెనీవారు బాగా చదువుకుని టాలెంట్‌ ఉండి డబ్బుల్లేక ఇబ్బంది పడే ఎంతోమందికి సాయం చేయటానికి ఇక్కడకి వచ్చారు. నావల్ల ఒక పది కుటు-ంబాలకి మంచి జరిగిన ఫరవాలేదని పించింది. అందుకే ఆర్వేన్సి స్‌ కంపెనీకి ఇండియా బ్రాండ్‌ అంబాసిడర్‌లా పని చేయటానికి మీ ముందుకు వచ్చాను అన్నారు.

ఆర్వేన్సిస్‌ సీఈవో డైరెక్టర్‌ శశిధర్‌ కొలికొండ మాట్లాడుతూ ”అలీ గారు కలసిన మేము ఆస్ట్రేలియాలో చేసే సేవలను ఇండి యాలో చేయాలి అని నిర్ణయించుకున్నాం. మనవాళ్లకు విద్య- వైద్య- -టె-క్నాలజీ రంగాల్లో ఎవరికి ఏ అవసరం ఉంటే ఆ అవసరాన్ని తీర్చాలని మా టీ-మంతా కంకణం కట్టు-కుని పనిచేస్తు న్నాం. అందుకే మా టీ-మంతా కలిసి వైజాగ్‌ లో మార్చి 3-4 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఏర్పాటు- చేస్తున్న ఇన్వెస్ట్‌ మంట్‌ బిజినెస్‌ సమ్మిట్‌కు హాజరవుతు న్నాం” అన్నారు. బ్రూస్‌ మ్యాన్‌ఫీల్డ్‌ మాట్లాడు తూ ” అలీ లాంటి వ్యక్తి మాకు, మా కంపెనీకి అండ గా నిలబడటం ఎంతో ఆనందంగా ఉంది.” అన్నారు. ఇండి యాలో మా కంపెనీ సాయం కోరి వచ్చిన అర్హులకు సాయం చేయటానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆర్వేన్సిస్‌ హెడ్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ సుకన్య కంభంపాటి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement