Monday, May 6, 2024

Breaking | మళ్లీ ఉగ్ర రూపం​.. భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి ప్రవాహం

కుండపోత వ‌ర్షాల‌తో వాగులు, వంక‌లు, ఉప న‌దులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వ‌ర‌ద నీరు పోటెత్తడంతో గోదావ‌రి ఉగ్రరూపం దాల్చింది. నిన్న (గురువారం) రాత్రి 46.80 అడుగుల‌తో కాస్త శాంతించిన గోదారమ్మ మళ్లీ ఇవ్వాల (శుక్రవారం) ఉదయం 9గంటలప్పుడు ఉధృతంగా ప్రవహిస్తోంది.

ప్రస్తుతం గోదావరి 9 గంటలకు (శుక్రవారం) 47.50 అడుగులుగా ఉంది. పోలవరం ఎఫెక్ట్ తో వేగంగా కిందకి వరద నీరు వెళ్లడం లేదు. దీంతో బ్యాక్​ వాటర్​ వెనక్కి వస్తూ భద్రాచలం వద్ద వాటర్​ లెవల్స్​ పెరిగిపోతున్నాయి. ఎటువంటి నష్టం జరగకుండా ఏపి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. కూనవరం వద్ద గోదావరి, శబరి మరింత ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పేరూరు, ఏటూరునాగారం వద్ద వరద ప్రవాహం మరింత వేగవంతమైంది. మెడిగడ్డ ఉహించిన దానికంటే డబుల్ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement