Tuesday, April 30, 2024

అద‌ర‌గొడుతోన్న‌.. ఏజెంట్ గ్లింప్స్

ఏజెంట్ గా రానున్నాడు హీరో అఖిల్. ఈ చిత్రం నుండి మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్.దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. వక్కంతం వంశీ కథనందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్‌ 2 సినిమా బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.కాగా హై ఆక్టేన్‌ వోల్టేజీ యాక్షన్‌ సన్నివేశాలను ఇటీవలే పూర్తి చేసినట్టు కూడా తెలియజేశారు .హీరో అఖిల్ చాలా స్టైలిష్‌గా ఈ గ్లింప్స్ వీడియోలో కనిపిస్తున్నారు.ఈ మూవీలో సాక్షి వైద్య ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోండగా.. నటుడు డినో మోరియా కీలక పాత్ర పోషిస్తున్నాడు. హిప్‌ హాప్‌ తమిజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఏజెంట్‌ ఈ ఏడాది సమ్మర్‌ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఏజెంట్‌లో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement