Friday, April 26, 2024

కిడ్నాప్ చేయబోయిన దుండగులు.. తప్పించుకున్న మహిళ.. వైరల్ గా వీడియో

ఓ మహిళ జిమ్ కి వెళ్లి అనంతరం బయటకి వచ్చి తన కారులో కూర్చొంది. ఇంతలో నలుగురు వ్యక్తులు మెల్లగా ఆ కారుని సమీపించారు.డోర్లు తీసి అందులోకి ఎక్కి ఆ మహిళను కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ మహిళ తీవ్రంగా ప్రతిఘటించింది. గట్టిగా అరవడంతోపాటు కిడ్నాపర్లపై తిరుగబడింది. దీంతో వారు భయంతో కారు దిగి అక్కడి నుంచి పారిపోయారు.దుండగులు మహిళను కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించిన ఈ సంఘటన సమీపంలోని సీసీటీవీలో రికార్డ్‌ అయ్యింది.

ఆమె ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు జరిపారు. కిడ్నాపర్లలో ఒకరిని అరెస్ట్‌ చేసినట్లు యమునా నగర్‌ డీఎస్పీ కమల్‌దీప్‌ సింగ్‌ తెలిపారు. మిగతా ముగ్గురిని కూడా అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఆ మహిళ కిడ్నాప్‌ ప్రయత్నానికి కారణం ఏమిటదన్నది దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు సీసీటీవీలో రికార్డైన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. హర్యానాలోని యమునా నగర్‌లో ఈ సంఘటన జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement