Saturday, April 27, 2024

మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వాన.. హైదరాబాద్​లో డిఫరెంట్​ సిచ్యుయేషన్​!

వాతావరణంలో ఒకే రోజు వింత పరిస్థితిని చూస్తున్నారు హైదరాబాద్​ ప్రజలు. ఎందుకంటే ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఎండ దంచికొడుతుంటే.. సాయంకాలం నుంచి రాత్ర వేళల్లో చల్లని గాలులు, చిటపట చినుకులు కూల్​ చేస్తున్నాయి. దీంతో ఒకే రోజు రెండు రకాల వెదర్​తో ఇబ్బందులకు గురవుతున్నారు చాలామంది. కొంతమంది అయితే ఈ వింత పరిస్థితులను కూడా ఎంజాయ్​ చేస్తున్నారు.

మధ్యాహ్నం దాకా దంచికొడుతున్న ఎండల కారణంగా పగలంతా ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఇక.. రుతుప‌వ‌నాలు వచ్చినా పూర్తి స్థాయిలో వర్షాలు కురవకపోవడమూ దీనికి కారణంగా తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నా వాతావరణం పూర్తిగా కూల్​ కాలేదు. రాష్ట్ర‌ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలు మినహా ఎక్కువ ఏరియాల్లో వర్షం కురిసింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే.. ఉరుములు మెరుపులతో రికార్డు స్థాయిలో వానలు పడ్డాయి. దీంతో వ్యవసాయ పనులు కూడా ఉపందుకున్నాయి. అయితే.. ఆ వెంటనే వాతావరణంలో మార్పులతో మళ్లీ ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో వానల కోసం రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement