Monday, May 6, 2024

Adwani and Joshi – రామమందిర ఉద్యమ సారధులకు ఆయోధ్య లో నో ఎంట్రీ…

అయోధ్య : అయోధ్య రామమందిరం అంటే ముందు గుర్తొచ్చేది బిజెపి కురువృద్ధులైన ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషిలే. దశాబ్దాల క్రితం అయోధ్య రామ్ మందిర్ కోసం జరిగిన ఆందోళనలు, రథయాత్రల్లో వీరే కీలకం. కానీ వీరిని అయోధ్యలో రామ్ మందిర్ ప్రారంభోత్సవానికి ఈ ఇద్ద‌రు నేత‌లు హాజ‌రుకావ‌డం లేదు… ప్ర‌తిష్టాత్మ‌క రామ‌మందిరం నిర్మాణం కోసం ఉద్య‌మం న‌డిపి, బాబ్రీ మ‌సీద్ ను నేల‌మ‌ట్టం చేసిన ఈ ఇద్ద‌రూ సీనియ‌ర్లు వారిక‌ల సాకార‌మై, పూజ లందుకుంటున్న వేళ దూరంగా ఉంటున్నార‌నే వార్త ఇప్పుడ సంచ‌ల‌న‌మైంది..

అయితే దీనిపై ఆయోధ్య రామాల‌య ట్ర‌స్ట్ ప్ర‌ధాన కార్యదర్శి చంపత్ రాయ్ వివ‌ర‌ణ ఇచ్చారు.. అద్వాని, ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషీల ఉద్య‌మంతోనే రామ‌మందిర నిర్మాణ బీజం పడింద‌ని, వారి సేవ‌ల‌కు తాము ఎప్పుడూ కృత‌జ్ఞుల‌మేన‌ని పేర్కొన్నారు. ఇరువురి నేత‌ల ఆరోగ్యం, వయస్సును దృష్టిలో పెట్టుకుని వారిని ఈ కార్య‌క్ర‌మానికి రావ‌ద్ద‌ని తామే చెప్పామ‌ని, అందుకు వారిరువురు అంగీక‌రించారని వెల్ల‌డించారు. ఈ కారణాలతో వచ్చే నెల జరిగే మహాత్మాభిషేక కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని ఆలయ ట్రస్టు చెప్పారు.

కాగా, జనవరి 22న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే శంకుస్థాపన మహోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయని రాయ్ తెలిపారు. జనవరి 15 నాటికి సన్నాహాలు పూర్తవుతాయని, జనవరి 16 నుంచి ‘ప్రాణ ప్రతిష్ఠ’ పూజలు ప్రారంభమై జనవరి 22 వరకు కొనసాగుతాయని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement