Monday, April 29, 2024

అదానీ టైం బాగుంది, ప్రపంచ స్థాయిలో పలుకుబడి.. 100 మందిలో గౌతమ్‌కు చోటు..

టైమ్స్‌ 100 మోస్ట్‌ ఇన్‌ఫ్లుయెన్సియల్‌ పీపుల్‌ 2022 (అత్యంత పలుకుబడి కలిగినవారు) వ్యక్తుల్లో బిలియనీర్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు టైమ్‌ మేగజైన్‌ 100 అత్యంత పలుకుబడిన కలిగిన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అడ్వకేట్‌ కరుణా నూదీ కూడా చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షుడు ఉర్సుల్‌ వోన్‌ డెరి లీయెన్‌, టెన్నిస్‌ ఐకాన్‌ రఫెల్‌ నాదల్‌, యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌, మీడియా కింగ్‌ ఓర్ఫా విన్‌ ఫ్రే తదితరులు ఉన్నారు. ఒకప్పుడు ప్రాంతీయ వ్యాపార సంస్థగా ఉన్న అదానీ గ్రూప్‌ సంస్థ ఇప్పుడు విమానాశ్రయాలు, పోర్టులు, సోలార్‌, థర్మల్‌ పవర్‌, వినియోగదారుల వస్తువుల రంగాల్లో విస్తరించింది. దీంతో భారత్‌లోని దిగ్గజ గ్రూపుల్లో ఒకటిగా అదానీ గ్రూప్‌ నిలిచింది.

అదానీపై టైం ప్రశంసలు..

ఈ సందర్భంగా టైమ్‌ మేగజైన్‌ గౌతమ్‌ అదానీపై ప్రశంసలు కురిపించింది. గౌతమ్‌ అదానీ, నిశబ్దంగా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ పోతున్నారని తెలిపింది. అనాది కాలంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా గౌతమ్‌ అదానీ ఎదిగాడని చెప్పుకొచ్చింది. మహిళా హక్కుల ఛాంపియన్‌ అడ్వకేట్‌ కరుణ కూడా ఈ ఘనత సాధించారు. కొన్ని రోజుల క్రితం.. 122 బిలియన్‌ డాలర్ల ఆస్తులతో.. వారెన్‌ బఫెట్‌ను కూడా గౌతమ్‌ అదానీ వెనక్కి నెట్టేశారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ పవర్‌ అదానీ పోర్ట్‌ ్స వంటి రంగాల్లో రాణిస్తున్నారు. పోర్ట్‌ , పవర్‌ సెక్టార్‌లో ఏకఛత్రాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అదేవిధంగా కరుణ నందిపై కూడా ప్రశంసలు కురిపించింది. ఆమె ఓ సాధారణ న్యాయవాది కాదంటూనే.. ప్రజల తరఫున పోరాడే వ్యక్తిగా అభివర్ణించింది. కోర్టు రూంలోనూ.. బయట తన గళం విప్పి.. న్యాయం తరఫున నిలబడే వ్యక్తిత్వం ఆమెది అంటూ టైమ్‌ మ్యాగజైన్‌ కొనియాడింది. నాయకుల కేటగిరిలో ఆసియా సమాఖ్య అధిపతి ఖుర్రం పర్వేజ్‌కు కూడా చోటు దక్కింది. కశ్మిరీల హక్కుల కోసం పోరాడుతున్నాడు. గతేడాది జాబితాలో మోడీ, మమత బెనర్జీ, అదర్‌ పూనావాలా చోటు దక్కించుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement